కర్ర ప్యానల్ డైరెక్టర్లు ఏ పార్టీ వారో స్పష్టం చేయాలి..
డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పిన మాటను
నిజం చేస్తావా కర్ర.. ?
డిసిసి అధ్యక్షుడు ఈ విషయంపై స్పందించాలి..
గెలిచిన వారంతా కాంగ్రెస్ వారేనని డిసిసి అధ్యక్షుడు ప్రకటన ఇచ్చారు..
కర్ర రాజశేఖర్, డైరెక్టర్లు బీఆర్ఎస్ బిజెపి వాళ్లతో సంబరాలు చేసుకుంటున్నారు..
ఇదేనా నైతికత..?
ఆ పార్టీల లోపాయికార ఒప్పందంతో ఆనైతిక పొత్తు పెట్టుకున్నారు..
బండి సంజయ్ సపోర్టుతో కర్ర ప్యానెల్ గెలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు..
ఈ విషయాన్ని కర్ర ఖండించకపోవడం దారుణం..
డిసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మూల రవీందర్ రెడ్డి..
కరీంనగర్, నిఘా న్యూస్: అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన కర్ర రాజశేఖర్ ప్యానల్ డైరెక్టర్లు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టం చేయాలని డిసిసి ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మూల రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు గెలిచిన వారంతా కాంగ్రెస్ వారైనని వారే విజయం సాధిస్తారని డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారని పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షుడి ప్రకటనకు కట్టుబడి కర్ర రాజశేఖర్ ఉంటారా.. అని ప్రశ్నించారు.
సోమవారం మీడియాతో మూల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బిజెపి వాళ్ళతో కర్ర రాజశేఖర్ అనైతిక పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బిజెపి వాళ్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అనైతిక చర్యలతో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. బీఆర్ఎస్ బిజెపి అనైతిక పొత్తు కరీంనగర్ లో బట్టబయలు అయిందని ఒకరు గెలుపు కోసం మరొకరు సహకరించుకోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే విజయం సాధిస్తారని జెండా ఎగరవేస్తారని స్పష్టం చేశారని తెలిపారు. డిసిసి అధ్యక్షుడి ప్రకటనకు కర్ర రాజశేఖర్ కట్టుబడి కాంగ్రెస్ లోనే ఉన్నానని రాజశేఖర్ ప్యానల్ డైరెక్టర్లు ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. డిసిసి అధ్యక్షుడు ఈ విషయంపై స్పందించాలని కోరారు. స్వచ్ఛమైన నీతిమంతమైన పాలన అందించేందుకే వెలిచాల రాజేందర్రావు మద్దతుతో నిర్మల భరోసా ప్యానల్ ద్వారా బరిలోకి దిగామని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల లో నూతన ఉత్సాహం నింపేందుకే ప్యానల్ ద్వారా బరిలోకి దిగామని స్పష్టం చేశారు. గెలుపు కోసం శాయాశక్తుల కృషి చేశామని పేర్కొన్నారు. ఓటమి చెందినప్పటికీ మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఆనైతిక చర్యలు బిజెపి టీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు పెట్టుకుని కర్ర రాజశేఖర్ ప్యానల్ గెలిచిందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో కర్ర రాజశేఖర్ పానల్ గెలిచిందని బిజెపి వాళ్లు సోషల్ మీడియాలో పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కర్ర రాజశేఖర్ మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదని దీన్ని ఖండించాల్సిన అవసరం ఉండగా ఖండించకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యని మండిపడ్డారు. నైతిక విజయం మా ప్యానల్ దేనని స్పష్టం చేశారు. దమ్ముంటే కర్ర రాజశేఖర్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అర్బన్ బ్యాంకును అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకోవాలనీ, అవినీతి ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడాలని రవీందర్ రెడ్డి సూచించారు. రాజేందర్ రావ్ ఆధ్వర్యంలో పోరాడి నైతిక విజయం మాత్రం సాధించామని స్పష్టం చేశారు.


