Sunday, April 19, 2026

ప్రకృతి ఫలాలతో గిరిజనులకు ఉపాధి!

పెద్దపల్లి, నిఘా న్యూస్: ఆదివాసి గిరిజన పుత్రు లకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం అందులోనూ కాలానుగు ణంగా లభించే ఇప్ప పువ్వు అతి ప్రధానమైనది, వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజను లు ఉపాధి పొందుతుం టారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి చెట్టుపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. ఎండబె ట్టిన ఇప్పపువ్వుతో నాటు సారా తయారు చేసి విక్రయించి ఉపాధి పొందుతారు.

అటవీ ఉత్పత్తుల్లో ఒకటైన ఇప్పపువ్వు.. గిరిజనులకు ఆదాయ వనరుగా మారా యి,గిరిజన ప్రాంతంలో సహజసిద్ధంగా లభించే ఇప్ప పువ్వును అటవీ ప్రాంత ప్రజలు బతుకు తెరువుగా భావిస్తారు. అలాంటి ఇప్పపువ్వు ప్రస్తుతం సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభి స్తుంది. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటున్నారు గిరిజన పుత్రులు..

కొండకోనల్లో జీవించే గిరిజ నులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతా ల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంట లు గిరిజనులకు ఆహార సంపదతో పాటు.. ఆదా య వనరులుగా ఉపయోగ పడుతుంటాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు, పాల పండ్లు, మొర్రి పండ్లు, తునికి పండ్లు,పరికి పండ్లు, తేనె, మామిడి, నేరేడు పండ్లు, వంటి వాటికి సీజన్ కావడంతో ఆదిలాబాద్ జిల్లాలో గిరిపుత్రులు సహజ సిద్ధంగా లభించే అడవి పండ్ల సేకరణలో నిమగ్నమయ్యారు.

ఎండ తీవ్రత ఉండటంతో, తెల్లవారుజామునే దగ్గర లోని అడవికి వెళ్లి, ఇప్ప పూలను సేకరిస్తారు. ఎండ తీవ్రమయ్యే సమయానికి ఇండ్లకు చేరుకుంటారు. ఇప్పపువ్వు సేకరణలో మహిళలు, పిల్లలే అధికం గా పాల్గొంటారు. తెచ్చిన పువ్వును ఎండ పెట్టి వంటకాలు చేసుకొని తింటుంటారు. మిగితా పువ్వును మార్కెట్ లో అమ్ముకుంటారు. అయితే మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనులు అటవీ ప్రాంతం లో సేకరించిన వీటిని సాయంత్రం వేళల్లో సమీప గ్రామాల్లో, మండల కేంద్రం లో విక్రయిస్తూ… జీవనోపా ధి పొందుతున్నారు.వేసవి కాలంలో సుమారు 45 రోజులపాటు లభించే ఈ అటవీ ఉత్పత్తులను గిరిజ నులు సేకరించి రోజుకు 300 నుంచి 500 రూపా యల వరకు సంపాదించు కుంటున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular