Tuesday, April 14, 2026

మహిళ మావోయిస్టులు అరుణ,స్వరూప,ల జాడ ఏది?

హైదరాబాద్, నిఘా న్యూస్:ఛత్తీస్‌గఢ్‌లోని మాచపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య సోమ వారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌ లో పార్థాపూర్ ఏరియా మహిళా కమాండర్ ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు. రూపి అలి యాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగా గుర్తించారు.

అరుణ, స్వరూప జాడ ఏది?

సిద్దిపేట జిల్లా నుంచి ముగ్గురు మహిళ మావోయిస్టులు ఉండగా.. అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపి చత్తీస్ ఘడ్ మాచ పల్లి అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే? మరి మహిళ మావోయిస్టు లు అరుణ, స్వరూపల జాడ ఎక్కడ వారు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది.

అక్కన్నపేటకు చెందిన కాశ బోయిన స్వరూప, నంగు నూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియ రావడం లేదు పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా లేక ఎక్కడన్నా తల దాచుకున్నారా? లేక పోలీసులకు లొంగిపోయా రా? ఒకవేళ పోలీసులకు లొంగిపోతే జీవనం ఎక్కడ గడుపుతున్నారు. లేదా భారీ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular