పెద్దపల్లి, నిఘా న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్, అలైవ్, రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఎస్సై డేగ రమేష్, ఆధ్వర్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించవలసిన అవసరం గురించి వివరించారు. డ్రైవర్లను ఉద్దేశించి ఎస్ఐ, డేగ రమేష్,మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, సర్టిఫికెట్లు ప్రతి ఒక్క డ్రైవర్ కలిగి ఉండాలని అయన తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫామ్ ధరించాలని అధిక లోడుతో ప్రయాణి కులను తీసుకెళ్లరాదని ఆయన సూచించారు. స్కూల్ బస్సు డ్రైవర్లు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాధ్యతయుతంగా వ్యవహరించాలని, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లతో పాటు స్కూల్ టీచర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
RELATED ARTICLES


