Tuesday, April 14, 2026

అంబేద్కర్ ఆశలు ఆశయాలు నెరవేరేనా?

పెద్దపల్లి, నిఘా న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతులు,వర్దంతులు, ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తూ ఆయన ఎత్తైన విగ్రహాలను నిర్మిస్తున్న పాలకులు, అయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ బద్దంగా పాలన సాగించకుండా ద్వంద్వ విధానాలు అమలు చేస్తు న్నారు. మన పాలకులు ఇది కడు శోచనీయం, మ రో పక్క రాజ్యాంగ మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. దేశాన్ని రాష్ట్రాలను వారి సొంత జాగిర్లుగా భావిస్తున్నారు. అంబేద్కర్ ముందు చూపు భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మన నాయకుల తీరు మారాలి..

ప్రశ్నించే స్వేచ్ఛ,ఆర్ధిక, సామాజిక,సాంఘిక, రాజకీయ సమానత్వం ఏర్పడితే అంబేద్కర్ ఆశయాలు, ఆశలు, నెరవేరుతాయి.ఇదే మన పాలకులు ఆ మహానీయు డికి ఇచ్చే నిజమైన నివాళులు.. రాజ్యాంగం మంచి చెడుల గురించి నేను మాట్లాడడం లేదు ఎందుకంటే అవి అమలు చేయడానికి మనం ఎన్నుకునే నాయకులను బట్టి ఉంటుంది..

ఏప్రిల్ 14న అంబేద్కర్ 135 వ జయంతిని దేశవ్యాప్తంగా ఒక పండగ లాగా జరుపుకుంటారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటే, ప్రభుత్వ యంత్రాంగం కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుం ది, అంబేద్కర్ లక్ష్యాలను, ఆశయాలను, ముందుకు తీసుకుపోదామని ప్రతిజ్ఞలు కూడా చేస్తారు.

అంబేద్కర్ కు నిజమైన నివాళి ఇవ్వటం అంటే అయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేయటం కాదు. ఆయన కలలు కన్నా కుల నిర్మూలన కార్యక్రమాన్ని మన భుజాన వేసుకోవడ మే,ఆయన జీవితాంతం పోరాడింది భారతీయ సమాజంలోని కుల వివక్షతతో,పేదరికంతో అవమానాలతో జీవనాన్ని కొనసాగించిన బడుగు, బలహీన వర్గాల గురించే, భారతీయ సమాజంలో ప్రత్యేకించి హిందూమతం లో ఉన్న అవమానుషమైన అంటరానితనాన్ని నిర్మూ లించాలని జీవితాంతం ఆయన కృషి చేశాడు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular