అర్బన్ ఎన్నికలపై తలో మాట
ప్యానల్ ఉందని వెలిచాల.. లేదని కవ్వంపల్లి ప్రకటనలు
కాంగ్రెస్ కార్యకర్తల అయోమయం
కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో ఒక చర్చ రగులుతోంది. అర్బన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత వెలిచాల రాజేందర్‌రావు పేరు మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు నాయకులను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్‌రావు బహిరంగంగా ప్రచారం చేయడం కొందరికి నచ్చలేదు. ఆయన ఈ ప్రచారం కాంగ్రెస్ తరపుననే జరుగుతోందని చెప్పగా, మరో వర్గం మాత్రం “అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికారికంగా కాంగ్రెస్ ప్యానల్ లేదు, కాబట్టి ఇది తప్పుడు ప్రచారం” అని ఆరోపణలు చేశారు.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ప్యానల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, మంత్రుల అండదండలు, మద్దతు తమకే ఉందంటూ అర్బన్ బ్యాంక్ ఎన్నికలో ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రకటన విడుదల చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్చార్జి మంత్రి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉండగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి సరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తో పాటు ఇతర ముఖ్య నేతలతో జరిపిన చర్చలో తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎలాంటి ప్యానల్ ను ప్రకటించలేదని ప్రకటనలో వెల్లడించారు. దినపత్రికల్లో మంత్రుల, ఎమ్మెల్యేల అండదండలు మాకే ఉన్నాయంటూ అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్లారిఫికేషన్ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్యానల్ ప్రకటించిన వారిలో అందరూ కాంగ్రెస్ పార్టీల కొత్తవారు కావడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైనట్లు చర్చ జరుగుతుంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, నా కష్టానికి నిదర్శనమే అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు మంత్రుల అండదండలతో నన్ను అర్బన్ బ్యాంక్ చైర్మన్ ను చేసింది. ఈ ఎన్నికల్లో కూడా నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రభుత్వం అండదండలు ఉంటాయని ఎమ్మెల్యేల, మంత్రుల అండదండలతోనే నేను బ్యాంక్ ఓటర్లు ఆశీర్వాదంతో గెలిచే వారికే నా ప్యానల్ లో చోటు కల్పించానని, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రభుత్వం అండదండలతో అర్బన్ బ్యాంక్ పై జెండా ఎగరవేస్తానని గడ్డం విలాస్ రెడ్డి. మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రచారం కూడా ప్రచారం కూడా చేసుకుంటున్నాడు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రభుత్వం అండదండలు ఆశీర్వాదం, ఎవరికి ఉంటాయోఅని పార్టీ నాయకుల్లో కలవరం మొదలయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల కు ప్రాధాన్యత ఇస్తుందా?. జూనియర్లకు, ప్రాధాన్యత ఇస్తుందా? సందిద్దంలో పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు, ప్యానల్ ప్రకటించలేదు అని చెప్పడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సంధిద్దంలో పడ్డారు. వెలిచాల రాజేందర్ రావ్, గడ్డం విలాస్ రెడ్డి, ఎమ్మెల్యేల మంత్రుల అండదండలు ఉన్నాయని చెప్పడం పై ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్గ పోర మరోసారి బట్టబయలు కావడంతో సర్వత్ర విమర్శలు వెలుగుతున్నాయి. వెలిచాల రాజేందర్ రావు సొంత ప్యానల్ ను ప్రకటించి అధిష్టానానికి తన నొప్పిగా మారాడా? అన్న ప్రశ్న అందరిలో కలవరపెడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతుంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ల ప్రచారం ఎవరికి వారే ప్యానల్ ప్రకటించుకుని ప్రచారం, చేసుకోవడం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఏ ప్యాసలకు మద్దతు ఇస్తుందో అని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నాయకులు ఎప్పుడు స్వస్తి పలుకుతారో అని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ పరిణామాలతో కరీంనగర్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. పై స్థాయి నాయకత్వం మధ్య తలెత్తిన ఈ విభేదాలు కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. పార్టీ ఐక్యత కోసం సీనియర్ నాయకత్వం సమయానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు.మొత్తంగా, వెలిచాల రాజేందర్‌రావుపై ఆరోపణలతో మొదలైన ఈ వివాదం, కరీంనగర్ కాంగ్రెస్‌లో అంతర్గత పరిస్థితులను మళ్లీ వెలుగులోకి తెచ్చింది. రాజకీయంగా వచ్చే రోజుల్లో ఈ అంశం పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.


