లోకల్ బాడీస్ లేకపోవడంతో కోల్పోతున్న కేంద్ర నిధులు
జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ ల అమలు ప్రక్రియ సరైనదే
చట్టబద్ధంగా చేయని రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల ఎన్నికలకు అడ్డంకి
సిరాస్తులు అమ్మి ఖర్చులకు డబ్బులు కూడబెట్టిన ఆశావహులు
కరీంనగర్ , నిఘా న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ గందరగోళంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిపాలన వ్యవధి ముగిసి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. లోకల్ బాడీస్ లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వ్యవధి ముగిసినప్పటి నుంచి ఇప్పటికి పలుమార్లు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటనలు చేసి వాయిదా వేయడం.. ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం హైకోర్ట్ స్టే తో ఎన్నికలు నిలిచిపోవడంతో జనం విసుగెత్తిపోతున్నారు.
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ ల పెంపు సరైన నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకపోవడం ఎన్నికలు నిలిచిపోవడానికి కారణమైందని కొందరు పార్టీల నాయకులు ఆరోపిస్తన్నారు. ఆర్థికంగా బలంగా లేని, స్థానిక సంస్థలలో పోటీ చేసే ఆశావహభ్యర్థులు ఎన్నికల ఖర్చుల నిమిత్తం వారి స్థిరాస్తులను అమ్మకానికి సిద్ధంగా ఉన్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఇంకొందరు అధిక వడ్డీకి అప్పులు తీసుకువచ్చి, నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుపుతున్నార. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మొదటి విడత నోటిఫికేషన్ ను అనుసరించి నామినేషన్ లు వేసిన అభ్యర్థులకు డబ్బులు రిఫండ్ అవుతాయా? లేవా? అన్న మరో సందేహం నెలకంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం న్యాయకోవిదులతో చర్చించి, చట్టబద్ధంగా రిజర్వేషన్ లు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలి.


