Friday, September 25, 2026

యూపీఐ చెల్లింపులపై వినియోగదారులకు పైసా భారం లేదు: కేంద్ర మంత్రి నిర్మలమ్మ!

హైదరాబాద్, నిఘా న్యూస్: యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ చార్జీలు విధింపులపై దేశవ్యాప్తంగా సాగు తున్న ప్రచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెరదించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె ఈ అంశంపై సాధారణ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని దీనివల్ల ఖాతాదారులపై పైసా భారం కూడా పడబో దని తేల్చిచెప్పారు.

రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట డిజిటల్ లావాదేవీ లకు ఎండీఆర్ వర్తించినా, అది వినియోగదారులకు కాదని, వ్యాపారులకే పరిమితమని మంత్రి చెప్పారు.ఎండీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను, సెస్ లేదా సర్‌చార్జ్ కాదని… ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని స్పష్టం చేశారు.

బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం ఈ రుసుము ఉంటుం దని వివరించారు. ఎండీఆర్ నిబంధన లపై అవగాహన లోపం వల్లే అనవసర అపోహలు వ్యాపిస్తు న్నాయని అన్నారు.

ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల్లో వ్యాపారులు ఇలాం టి రుసుములను భరిస్తున్నారని గుర్తుచేశారు. యూపీఐ చెల్లింపుల విషయంలోనూ ఈ చార్జీని కస్టమర్లపైకి నెట్టే అవకాశం ఉండదని మంత్రి తేల్చిచెప్పారు.

డిజిటల్ చెల్లింపు లను ఉపయోగించే ప్రజలకు సేవలు ఉచితంగానే, ఎప్ప టిలాగే అంతరాయం లేకుండా అందుబా టులో ఉంటాయని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు గందరగోళా నికి గురికావొద్దని సూచించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular