హన్మకొండ, నిఘా న్యూస్ :హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ బాలికల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థినుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థి ని బేసిక్ ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఉపా ధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థినులతో మంత్రి నేరుగా మాట్లాడి వారికి ప్రతిరోజూ నాణ్య మైన భోజనం, అల్పాహారం అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయని విద్యార్థినులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలిపారు.
గత విద్యా సంవత్స రంలో విద్యార్థినులు సాధించిన మార్కు ల వివరాలను అడిగి తెలుసుకు న్నారు.ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, పాటలు, సాంస్కృ తిక కార్యక్రమాల్లో కూడా ముందుండా లని అన్నారు.


