హైదరాబాద్, నిఘా న్యూస్ : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభ వార్త అందించింది, ఈరోజు నుంచే రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి. ఈ మేరకు రైళ్ల వివరాలతో పాటుగా స్టేషన్లు, షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ఈ రెండు నెలల కాలం లో శబరిమలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కలగనుంది.తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల మండల-మకరవిళక్కు సీజన్లో ప్రయాణించే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటంతో, దక్షిణ మధ్య రైల్వే 54 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్ తో పాటు నల్గొండ- గుంటూరు మరియు కాజీపేట-విజయవాడ రెండు ప్రధాన మార్గాలను కలుపు తూ 54 ప్రత్యేక రైళ్లను నడపేలా నిర్ణయించారు. శబరిమలకు గేట్వేగా పిలిచే చెంగన్నూర్, కొట్టాయం స్టేషన్లలో అన్ని ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడం వల్ల భక్తులకు సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. చర్లపల్లి – కొల్లం – చర్లపల్లి (07199/07200) మధ్య 6 ప్రత్యేక సర్వీసులను ప్రకటిం చారు. డిసెంబర్ 30, జనవరి 6, 13 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరి; జనవరి 1, 8, 15 తేదీల్లో కొల్లం నుంచి తిరిగి వస్తాయి. ఈ రైలు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనున్నాయి.
శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు
RELATED ARTICLES


