Friday, November 20, 2026

అమెరికాలో విమానాల నిలిపివేత!

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వైఫల్యం

హైదరాబాద్, నిఘా న్యూస్ ప్రతినిధి : అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రయాణికులకు అంతరాయం ఏర్ప డింది దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల మధ్య కమ్యూని కేషన్ వ్యవస్థలో సాకేతిక సమస్య తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో తలెత్తిన భారీ కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యా ప్తంగా విమాన రాకపోకలు అస్తవ్య స్తమయ్యాయి.

ప్రయాణికుల భద్రత ను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసరంగా గ్రౌండ్ స్టాప్ విధించింది. దీంతో వేలాది విమానాలు ఆలస్యమవ్వగా, మరికొన్ని రద్దయ్యా యి. లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.54 గంటలకు ఎఫ్ ఏ ఏ ఈ నిర్ణయం తీసుకుంది.

నేలపై ఉన్న విమానాలు టేకాఫ్ కాకుండా ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే గాలిలో ఉన్న విమానాలు మాత్రం తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించింది. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్‌అవేర్ వివరాల ప్రకారం 11 వేలకు పైగా విమానాలు ఆలస్యం లేదా రద్దు కు గురయ్యాయి. ఇందులో సుమారు 10 వేల విమానాలు ఆలస్యమవ్వగా, వెయ్యికి పైగా విమా నాలు రద్దయ్యాయి.

మరోవైపు వంద లాది విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించారు.ఈ అంతరాయం అంతర్జాతీయ విమాన సర్వీసుల పైనా ప్రభావం చూపింది. కెనడా, యూరప్ నుంచి అమెరికాకు వచ్చే విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. అమెరికా నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలను పరిస్థితిని బట్టి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular