హైదరాబాద్, నిఘా న్యూస్: సంగారెడ్డి జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ముదిలి వసంతరావు నియమితు లయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్రూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న వసంతరావుకు సివిల్ సర్జన్ ( జనరల్ లైన్) పదోన్నతి కల్పించి సంగారెడ్డి డీఎంహెచ్ వోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన గతంలో రాజన్నసిరిసిల్ల డీఎంహెచ్ వోగా, పెద్దపల్లి డిప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేశారు. ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని డాక్టర్ వసంతరావు తెలిపారు. అలాగే, కోహీర్ డిప్యూటీ డీఎం హెచ్త్వోగా విధులు నిర్వహిస్తున్న డా.జి.గాయత్రీదేవీకి కూడా సివిల్ సర్జన్ గా పదోన్నతి కల్పించి హైదరాబాద్ లోని పేట్లబురుజు మెటర్నిటీ ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంవోగా నియమించి బదిలీ చేశారు. నారాయణఖేడ్ డిప్యూటీ డీఎంహెచ్వి సంధారాణి కూడా సివిల్సర్జన్ పదోన్నతిపై హైదరాబాద్ లోని మెంటల్టెల్త్ హాస్పిటల్కు ఆర్ఎంవోగా బదిలీ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా ముదిలి వసంతరావు
RELATED ARTICLES


