కరీంనగర్, ఇక న్యూస్: కర్నూల్ లో జరిగిన బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెల్లిని 19 మంది సజీవం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు జాతీయ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ బాధ్యత కుటుంబాలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ ప్రమాదంలో కొందరు మరణించడంతో తమ కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారని.. వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సరైన వైద్యం అందించి ఆదుకోవాలని కోరారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి.. ఎప్పటికప్పుడు వాటి ఫిట్నెస్ గురించి అలా తీయాలని కోరారు. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు ఇలా నిర్లక్ష్యంగా ఉండడంతోనే జరిగాయని.. ఇకపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ
RELATED ARTICLES


