బ్యాలెట్ లో భవితవ్యం
నిఘా సర్వే..
కరీంనగర్, నిఘా న్యూస్: ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు పోటాపోటీగా పాల్గొన్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అభ్యర్థుల భవితవ్యం మార్చి 3 తేలనుంది. దీంతో పలువురు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారి భవితవ్యం బాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. అయితే బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి తన సర్వేలో గెలుపు పై ఆశలు పెంచుకున్నారు. బిజెపి నిర్వహించిన సర్వేలో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే కాంగ్రెస్ రెండో స్థానంలో, డీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కింది స్థాయి నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందనున్నట్లు ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పటికిని ఎవరు గెలిచిన ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని ఓటర్లు కోరుకుంటున్నారు.


