వేములవాడ, నిఘాన్యూస్: ఈరోజు వేములవాడ సిపిఎం పట్టణ శాఖ మహాసభలు నిర్వహించడం జరిగింది.ఈ మహాసభలలో వేములవాడ పట్టణ సిపిఎం కార్యదర్శిగా ముక్తి కాంత అశోక్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ మహాసభ సందర్భంగా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి గారికి ఘనంగా మహాసభ నివాళులు అర్పించింది.సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూష్యం రమేష్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరాటాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరందిన వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం ప్రధాన రహదారులు గా ఇరుకుగా ఉండడం వలన భక్తులకు రాకపోగలరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం అనేక దఫాలుగా రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపడతామని దానికి అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తామని గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలతో మభ్యపెడుతూ రావడం జరుగుతుంది కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు మాత్రం యుద్ధ ప్రాతిపంగా తీసుకోవడం లేదు వెంటనే రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మానేరుపై నిర్మిస్తున్న బ్రిడ్జి మూడు సంవత్సరాలైనా పూర్తవుతలేదు మధ్యలోనే పనులు నిలిపివేయడం వలన ఒక్క సైడు బ్రిడ్జి మీద ప్రజలు రాకపోకలు నిర్వహించడం వలన ప్రమాదాలు ఏర్పడతామని ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది దీనికి సంబంధించిన నిధులు కేటాయించి మధ్యలో ఆగిన బ్రిడ్జిని పూర్తి చేసి రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు వేములవాడ పట్టణానికి లోఎంతోమంది నిరుపేదలు ఇల్లు లేక ఇప్పటికే అనేక దఫాలుగా ప్రభుత్వానికి అధికారులకు ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది కానీ గత పది సంవత్సరాల నుండి ఒకరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపాన ప్రభుత్వం పోలేదు వేములవాడ లోన తేట్టే కుంట వద్ద నిర్మాణాన్ని తలపెట్టిన డబల్ బెడ్లు స్లాపల వరకు పోసి వదిలి వెయ్యడం జరిగింది అవి పూర్తి చేయకపోవడం వలన సుమారు వంద వరకు నిర్మాణంలో ఉన్నటువంటి డబల్ బెడ్ రూమ్ శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి వాటిని వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు అందించాలని దేవస్థానం ఆధీనంలో ఉన్న భక్తులకు ఇచ్చే గదులు పరిశుభ్రత లేక సరియైన వసతులు లేక చెత్తాచెదారులతో గదులు అద్దెకు తీసుకొని ఉండే భక్తులు ఉండడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇలాంటి సమస్యలు అనేకం వివరాలు పట్టణంలో ఉన్నాయి ఈ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారుఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగు మంటి ఎల్లారెడ్డి మల్లారం ప్రశాంత్ గుర్రం అశోక్ చిలుక బాబు పరుశరాములు నాగేష్ సిరిమల్లసత్యం తదితరులు పాల్గొన్నారు
వేములవాడ దేవస్థానం ప్రధాన రోడ్ల వెడల్పు పనులు వెంటనే ప్రారంభించాలి
RELATED ARTICLES


