గౌడ కులస్తులకు ఉపాధి కల్పన కోసం ఈత చెట్ల పెంపకానికి చర్యలు
రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్:కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం విప్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝతాటి చెట్ల పై నుంచి కల్లు తీసే గౌడ కార్మికుల ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందిఈత చెట్లు, తాడి చెట్లు జీవనాధారంగా కొనసాగుతున్న గౌడ సోదరులకు అవసరమైన సహాయం అందించేందుకు కాటమయ్య కిట్లను పంపిణి చేయడం జరిగింది.గౌడ కులస్తులకు ఇప్పటికే పెన్షన్ అందిస్తున్నామని, ప్రమాదాలు జరిగితే పరిహారం సైతం అందిస్తున్నాం..
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి ఆర్థికంగా రాష్ట్రo చాలా దెబ్బతిందని, ప్రతి నెలా వచ్చే 18 వేల కోట్ల ఆదాయంలో 6 వేల కోట్ల అప్పుల వడ్డీలకే ఖర్చు అవుతుంది.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అంశంలో వెనుకాడటం లేదు.ఆర్థిక లీకేజీలను, ఆడంబరాలను అరికడుతూ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాము..ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గం గౌడ కులస్తులందరికీ కిట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ గౌడ కులస్తులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ దూలం భూమేష్, కృష్ణ, శ్రీనివాస్ ,మహేష్ ,చిరంజీవి గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు


