వేములవాడ,నిఘా న్యూస్:నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం స్వామి వారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, పట్టణ బిజెపి అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న సేవలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
RELATED ARTICLES


