బోయినపల్లి నిఘా న్యూస్: బోయినిపల్లి మండలం వరదవెల్లి వద్ద మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లేందుకు బోటు ను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దత్తాత్రేయ స్వామి వారికి దర్శించుకున్నారు.అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పెట్టిన సమగ్ర సర్వే ఎం చేశారు, అది బయట పెట్టండి, సమగ్ర కుటుంబ సర్వే కోసం లండన్, అమెరికా నుండి వచ్చారు…సమగ్ర సర్వే చేసి కెసిఅర్ డబ్బులను వృథా చేశారు, అ డబ్బులను కెసిఅర్ నుండి రికవరీ చేయాలి,కెసిఅర్, కేటీఆర్ లను చూస్తే రాజకీయల పై అసహనం వేస్తుంది..10 ఏళ్ళు ప్రజలకు చేసింది ఎం లేదు..దత్తాత్రేయ స్వామి వారు ఎంతో మహిమ గల వారు, 500 ఏళ్ల చరిత్ర కలిగిన దేవుడుప్రతి ఏటా పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతుంటుంది, భక్తులు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి వస్తుంటారు కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల విశ్వాసం..
గత ఏడాది నేను ఎంపీగా ఉన్న సమయంలో దర్శనం చేసుకున్నాను..కానీ ఇక్కడ దేవాలయానికి రావడానికి భక్తుల ఇబ్బందులు గుర్తించి,10 లక్షల ఎంపీ నిధులతో బోట్ ప్రారంభం చేశారని తెలియజేశారు.
దత్తాత్రేయ స్వామి వారికి దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
RELATED ARTICLES


