రాజధానిలో ఫైరవీలతో పావులు కదుపుతున్న ఉద్యోగులు..
*రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీలు ముందుకు సాగేనా…?
వేములవాడ జూలై 25.(నిఘా న్యూస్) ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీల ఉత్కంఠకు మరో మూడు రోజులలో తెర పడనుందా అనే సందేహం ఇప్పుడు వేములవాడ పట్టణ ప్రజలలో చర్చనీయంగా మారింది.గత15 రోజుల క్రితం బదిలీల వార్త వెలువడిన నుండి ఆలయ ఉద్యోగులలో కంగారు మొదలైంది. నిజాయితీగా ఉద్యోగం చేసే ఉద్యోగులకు బదిలీలపై ఉలికెందుకు బదిలీలకు మరో మూడు రోజులు సమయం ఉండగా ప్రస్తుతం ఆలయ ఉద్యోగులు ఫైరవీలకు తెర లేపుతూ రాజధాని బాట పట్టారు. ఎలాగైనా బదిలీలు ఆపాలని ఎంపీలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.గతంలో ఎన్నోసార్లు ఉద్యోగుల అక్రమాలపై వార్త కథనాలు వచ్చిన సందర్భంలో విజిలెన్స్ అధికారులచే విచారణ జరిపించాలని వార్త కథనాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలపై దృష్టి సారించారు.బదిలీలకు మోక్షం కలిగించి ఇంకా పూర్తి కాకముందే ఉద్యోగులు పైరవీలకు తినలేపుతూ నేతల చుట్టూ ప్రదర్శనలు చేయటం ఏమిటని వేములవాడ పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఏది ఎలా ఉన్నా ఉద్యోగుల మంత్రాంగం ఫలించి బదిలీల ఫైల్ ని పాతాళానికి తొక్కేరా…
యధావిధిగా బదిలీల ప్రక్రియ కొనసాగించేరా వేచి చూడాల్సిందే…?


