వేములవాడ (నిఘా న్యూస్ ):హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో, భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నిమ్పేదే దీపావళి . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి సందర్బంగా రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైన రాజన్న ఆలయంలో దీపావళి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలుచేసి పురవిదులలో ఉత్సవ మూర్తుల శోభాయాత్ర వైభవంగా జరుగుతుంది దీపావళి సందర్బంగా రాజన్నదేవలయం రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది వేములవాడ రాజన్న ఆలయంలో మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీపావళి పండగ కార్తీక మసరభం పర్వదినాల నేపథ్యంలో ప్రత్యేక ఆకర్షణగా ఆలయాన్ని ముస్తాబు చేశారు.



