బాధితునికి అప్పజెప్పిన ఎస్సై శ్రీకాంత్ గౌడ్*
రాజన్న , నిఘా న్యూ స్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర మంగళవారం వేములవాడకు చెందిన వంతెన బాబు అనే వ్యక్తి తన చేతి బ్రాస్లైట్ను పోగొట్టుకున్నాడు ఎంత వెతికినా దొరకపోవడంతో వెని తిరిగాడు పోగొట్టుకున్న బ్రాస్లైట్ అక్కడ ఒక వ్యక్తికి దొరకడంతో 100 డయల్ ఫోన్ చేసి తనకు బ్రాస్లెట్ దొరికిన విషయం చెప్పాడు విషయం తెలుసుకున్న బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ జీవన్ వెళ్లి అతని దగ్గర బ్రాస్లైట్ తీసుకున్నాడు ఎవరైతే బ్రాస్లెట్ పోగొట్టుకున్నాడు అతనిని పిలిపించి వివరాలు తెలుసుకొని పోగొట్టుకున్న వ్యక్తి వేములవాడ మంతెన బాబు అని గుర్తించి ఆయనకు బ్రాస్లైట్ను ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అందజేశారు .


