వేములవాడ, నిఘా న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 11 నెలల్లో 51 మంది గురుకుల హాస్టల్స్ విద్యార్థులు మృతి చెందారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వం హత్యలేనని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పారు. రాష్ట్రంలో హాస్టల్స్, గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాల లో నాణ్యమైన ఆహారం అందడం లేదని అన్నారు. విద్యార్థులకు గ్రిజర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అగ్రహారం జేఎన్టీయూలో కనీస వసతులు లేక నాణ్యమైన ఆహారం అందడం లేదని, తరగతి గదులు సరిపోలేని దుస్థితి ఎదురుకావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో తరగతి గదులు సరిపోక ఇబ్బందులకు గురవుతున్నారని, గురుకుల హాస్టల్ లల్లో విద్యార్థుల మరణాలపైన వారి సమస్యలపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందనీ కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ తో ఎంతోమంది విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. ఫుడ్ పాయిజన్, ఇతర కారణాల వల్ల ఇప్పటికే 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమని అన్నారు. ఇప్పటికైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రంజిత్ కుమార్ తో ఏబీవీపి జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు, మహీదార్, మధు, గంగ ప్రసాద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
RELATED ARTICLES


