కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేత వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికే పాఠశాల సిబ్బందిని బదిలీ చేసినప్పటికీ.. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాలికల పాఠశాలలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ఆయన మండి పడ్డారు. అంతేకాకుండా ఈ విషయాలను దాచి పెట్టిన ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకండా కలెక్టర్ చొరవ తీసుకోవాలని అన్నారు.


