కరీంనగర్, నిఘా న్యూస్: ఎస్జీఎఫ్ కరీంనగర్ అర్బన్ మండల స్థాయి క్రీడాపోటీలు ఈ నెల 9వ తేదీ నుండి 17 తేదీ వరకు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మంకమ్మతోట, భగత్ నగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపించారు. జూనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించగా సీనియర్ వాలీబాల్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని జూనియర్ కబడ్డీ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని, సీనియర్ ఖొఖొ బాలికల విభాగంలో ద్వితీయ స్థానాన్ని, సీనియర్ కబడ్డీ బాలుర విభాగంలో ద్వితీయ స్థానాన్ని, జూనియర్ వాలీబాల్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అథ్లెటిక్ లో 8వ తరగతి చదువుతున్న సాయి చైతన్య 400 మీటర్ల రన్నింగ్ పోటీలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించగా, 600 మీటర్ల మరియు 100 మీటర్ల రన్నింగ్ పోటీలో, రజత పతకాన్ని, జూనియర్ హైజంప్ విభాగంలో రజత పతకాన్ని సాధించి ఈ నెల ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్తోజోన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. సీనియర్ బాలికల విభాగంలో 10వ తరగతి చదువుతున్న కె.కావ్య లాంగ్ జంప్ లో రజత పతకాన్ని, హైజంప్ 9వ తరగతి చదువుతున్న హన్సి కాంస్య పతకాన్ని, 400 మీటర్ల రన్నింగ్ పోటీలో 10వ తరగతి చదువుతున్న ఒ. సుమలత రజత పతకాన్ని మరియు డిస్క్ జూనియర్ బాలికల విభాగంలో ఎన్. సందీప, జూనియర్ బాలుర విభాగంలో జి.సాత్విక్ కాంస్య పతకాలు సాధించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డిగారు రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి సాయిచైతన్యను అభినందించి, ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభను కనబర్చి పాఠశాలకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని, మరియు సిద్ధార్థ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందుంటారని మరోసారి నిరూపించారని తెలియజేస్తూ, గెలుపొందిన విదార్థులను అభినందించి హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డిగారు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయ బృందం మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.


