కరీంనగర్, నిఘా న్యూస్:కరీంనగర్ పట్టణం తీగల గుట్టపల్లిలోని 120 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వట్టణ 20 డివిజన్ బిజెపి నాయకులు బారి జితేందర్ బుధవారం రోజున మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. 120 సర్వే నెంబర్ లో ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం, అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఇట్టి సర్వే నంబర్లో దాదా 12 గంటల భూమిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించి తప్పుడు వత్రాలతో విక్రయాలు పడుతున్నారని, ఇందులో కొందరు మాజీ వ్రజా ప్రతినిధుల హస్తం, ప్రమేయంతో ఈ భూ కబ్జా వ్యవహారం నడుస్తుందని తెలిపారు. 120 సర్వే నెంబర్లు విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా చర్యలు చేపట్టి, భవిష్యత్తు ప్రజా అవసరాల కోసం వినియోగించడానికి, భూమిని కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి..
RELATED ARTICLES


