జెండా ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్
జగిత్యాల, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాల యంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అజారుద్దీన్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి అజారుద్దీన్‌కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికా రులు విశేష సంఖ్య లో పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్, జిల్లా లైబ్రరీ చైర్మన్ దినేష్. అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, తదితరులు పాల్గొన్నారు.


