Friday, May 15, 2026

ఎండాకాలం మండుతున్న చికెన్ ధరలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: చికెన్ ధరలు రోజు రోజుకు ప్రియం అవుతున్నాయి,వారం రోజుల నుంచి పరిశీలిస్తే ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి, ఈనెల 6న, స్కిన్ తో కిలో 260 ఉండగా.. ప్రస్తుతం 360 కి చేరింది, దీంతో కోడి మాంసం ప్రియులు చికెన్ కొనాలంటే జంకుతున్నారు. కిలో, రెండు కిలోలు తెచ్చుకుని తినేవారు అరకిలో తో సరిపెట్టు కుంటున్నారు.

మటన్ తో పోలిస్తే మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ గా చికెన్ ను ఇష్టపడ తారు.ధరలు అందుబాటులో ఉం టాయన్న కారణంతో సామాన్యులు ఎక్కు వగా చికెన్ ను కొను గోలు చేసి తింటారు. ప్రస్తుత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎండలు.. పెళ్లిళ్ల సీజన్‌.. సరఫరా తగ్గుదల.. వెరసి చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

రోజురోజుకూ చికెన్, మటన్ ధరలు పెరుగు తుండటంతో సామా న్యులు కొనాలా? వద్దా? అన్న పరిస్థితి నెలకొంది. తాజా చికెన్ రేట్ల ప్రకారం.. ఫామ్ రేట్ లైవ్ బర్డ్ (కోడి కిలో) 170 నుంచి 180 ఉంది. డ్రెస్సెడ్ చికెన్ రూ.320 -330 వరకు అమ్ముతున్నా రు.

స్కిన్ లెస్ రూ.350 నుంచి రూ.360 వరకు విక్రయిస్తున్నారు. గుడ్లు డజన్ రూ.72 నుంచి 75 వరకు విక్రయిస్తున్నారు. చికెన్ రేట్లు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు కోడి మాంసం కొనాలంటే కొనలేని పరిస్థితి.

ప్రస్తుతం ధరలు జూన్‌ నెలాఖరు వరకు ఇలానే ఉంటాయని వ్యాపారులు చెబుతు న్నారు.వేసవి తీవ్రత కారణంగా కోళ్ల మరణాలు పెరగడం, ఫారాల్లో ఉత్పత్తి తగ్గ డం వల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గిందని, మరోవైపు పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్ల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగా యని చెబుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular