కరీంనగర్, నిఘా న్యూస్: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, వారి సంస్మరనార్థం మంగళవారం నాడు అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మినారాయణ గారి చేతుల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఇందిరాచౌక్ (గీతా భవన్ చౌరస్తా) నుండి పోలీసు హెడ్ క్వాటర్స్ నందలి పోలీసు అమరవీరుల విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలనునిర్వహించామన్నారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ డీసీపీ తో పాటు ఏసీపీలు వెంకటరమణ , నరేందర్ , వేణుగోపాల్ , మాధవి , కాశయ్య లతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


