- ప్రహరీ గోడ నిర్మించి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం
- తమకే అమ్మాలంటూ వేధింపులపై డిపిఓకు ఫిర్యాదు
మేడ్చల్, (నిఘా న్యూస్): మేడ్చల్ మండల పరిధిలోని నూతనకల్ గ్రామంలో 3005 653, 672, 681,682 663, పేరు లేని వెంచర్ నిర్వాహకులు ఎలాంటి అనుమ తులు లేకుండా వెంచర్ నిర్మాణం చేసి దాదాపు 150 నుండి 200 ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వెంచర్ లోపలికి ప్రవేశించే దారిలో భారీ కమాన్ పాటు గేట్లు నిర్మించారు. దీంతోపాటుగా లోపట పొలాలు ఉన్న రైతులను వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల పొలాలను వెంచర్ నిర్వహకులకు అమ్మాలంటూ ఇతరులకు అమ్మితే రోడ్లు బంద్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్,697. సృద్వి రాజు సర్వే నెంబర్ 697, వద్ద రోడ్డును తవ్వి తన భూమి లోకి వెళ్లకుండా సి.బి.సి. వి సత్యనారాయణ రాజు, ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని, డిపిఒకు ఫిర్యాదు చేశారు. ఫామ్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన దారి గుండా ఇతరుల స్థలానికి వెళ్ళ నివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు ఫార్మ్ ర్యాండ్ నిర్వహకులకు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా దారికి అడ్డుగా నిర్మించిన ఆర్చ్ సంబంధించిన, తాము చేసిన రోడ్డు నిర్మాణములకు సంబంధించిన పత్రాలు గ్రామపంచాయతీకి సమర్పించాలని నోటీసులు జారీ చేయగా సదరు వెంచర్ నిర్వాహకుల నుండి నేటి వరకు ఎలాంటి సమాచారం రాక పోవడంతో మంగళవారం మండల ఎంపీడీవో సునీత, నూతన్ కల్ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, శ్రీరంగవరం పంచాయతీ కార్యదర్శి రమణరెడ్డి, కొనయ్ పల్లి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఘటనా స్థలాన్ని చేరుకుని అక్రమ నిర్మాణాలను జెసిబిల ద్వారా తొలగించారు.


