Friday, November 14, 2025

కేటీఆర్‌ క్యాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, నిఘా న్యూస్:ఫార్మూలా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది.ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది. చట్టప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారు.ఫార్మూలా ఈ కారు రేసు కేసులో నిబంధనలు ఉల్లం ఘనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలో ఉన్న సమయంలో ఫార్మూలా ఈ కారు రేసు కేసులో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.అసలు ఏం జరిగిందనే అంశాలను తెలుసుకునేం దుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 2024 అక్టోబర్ 18న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ విచారించాలని ఏసీబీని కోరింది. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2024 డిసెంబర్ 14న అనుమతి ఇచ్చారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular