వేములవాడ రూరల్, నిఘా న్యూస్:వివరాల్లోకి వెళితే వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలోని బోయినపల్లి మరియు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత నెల లో వివిధ సందర్భాలలో జరిపిన వాహనాల తలఖీల లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 32 మంది డ్రైవర్ల పై చార్జి షీటు దాఖలు చేసి ఈరోజు వేములవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, వారిలో ఇద్దరికీ ఐదు రోజులు జైలు శిక్ష మరియు జరిమానా, ఇద్దరికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష మరియు జరిమానా మరియు మిగతా 28 మందికి జరిమానా విధించిన న్యాయమూర్తి. మొత్తంగా 64000 జరిమానా విధించడం జరిగింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసుల్లో పదిమందిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి 1000 చొప్పున 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని వేములవాడ రూరల్ సిఐ ఎం,శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.



