రాజన్న జిల్లా, నిఘా న్యూస్ :కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి” వేములవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఆది శ్రీనివాస్ ఈరోజు ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడు తూ.. రైతును రాజు చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని, పేర్కొన్నారు. సన్న రకం వడ్లకు కింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంద న్నారు.దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు.


