హైదరాబాద్, నిఘా న్యూస్: ఐపీఎల్ 2026 లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా, శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజ ర్స్ బెంగళూరు పై సన్ రైజర్స్ హైదరాబాద్, 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది, అయినా రన్ రేట్ కారణంగా టాప్-2 ప్లేస్ ను దక్కించుకోలేక ఇప్పుడు స్థానానికే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి 12 బంతుల్లో 29 నాటౌట్, మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు అద్భుతమైన ఆరంభా న్నిచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 4.3 ఓవర్లకే జట్టు స్కోరు ను 60 పరుగులకు చేర్చాడు. అయితే, ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటి కే విరాట్ కోహ్లీ (15), దేవదత్ పడిక్కల్ (21) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రజత్ పటీదార్ 39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్సర్ ఒంటరి పోరాటం చేశాడు. కృనాల్ పాండ్యతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, అవసరమైన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడం తో ఒత్తిడి పెరిగింది. పటీదార్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఔటయ్యాడు. చివరిలో కృనాల్ పాండ్య 41 నాటౌట్, టిమ్ డేవిడ్ 15 నా టౌట్ ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లతో రాణించగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ విజయంతో సన్‌రైజర్స్ 14 మ్యాచ్ లలో 9 విజయాలతో లీగ్ దశను ముగించిం ది. అయితే, మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్ పూర్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమి స్తుంది. గెలిస్తే ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్ 2లో తలపడునుంది.
బెంగళూరును పరుగెత్తించి కొట్టినా థర్డ్ ప్లేసే..
RELATED ARTICLES


