అమరావతి, నిఘా న్యూస్: సినిమాలు క్రీడాకారుల ప్రభావం తో విభిన్న హెయిర్ స్టైల్స్‌ను అనుసరించే విద్యార్థులకు ఇకపై బ్రేక్ పడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురందరూ ఒకే తరహా హెయిర్ కట్‌తో పాఠశాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ విద్యా సంవత్స రం నుంచే ఈ నిబం ధనలు అమల్లోకి రానున్నాయి.చదువుపై దృష్టి.. క్రమశిక్షణే లక్ష్యం పాఠశాలల్లో కొందరు విద్యార్థులు సినీ హీరోలు, క్రికెటర్ల ను అనుకరిస్తూ విభి న్న హెయిర్ స్టైల్స్‌తో వస్తుండటంతో చదువుకంటే రూపు రేఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది.
విద్యార్థుల్లో క్రమ శిక్షణ, సమానత్వ భావన పెంపొందిం చడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసు కున్నట్లు అధికారులు తెలిపారు.


