హైదరాబాద్, నిఘా న్యూస్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధు, క్రీడా రంగం లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోక్యో మెట్రోపాలిట న్ జిమ్నాసియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు అసాధారణ ఆటతీరును కనబరిచింది.
హోమ్ క్రౌడ్ మద్దతు తో బరిలోకి దిగిన జపాన్ స్టార్ బ్యాడ్మిం టన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ 3 అకానె యామగూచి ని వరుస గేమ్స్‌లో చిత్తు చేసింది. దీంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ దక్కించు కుంది.గత రెండేళ్లుగా పీవీ సింధు ఫామ్‌పై, ఆమె ఆటతీరుపై క్రీడా వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే వాటన్నింటికీ ఈ 31 ఏళ్ల భారత స్టార్ ప్లేయర్ తన పవర్ తో సత్తా చాటింది, తనపై అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఇచ్చింది అద్భుతమైన వ్యూహాలు, మానసిక దృఢత్వంతో కూడిన ఆటతో టోక్యో కోర్టు లోనే పక్కా సమాధా నం ఇచ్చింది.
ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటి గేమ్‌లో సింధు తనదైన శైలిలో క్రాస్ కోర్ట్ డ్రాప్స్, పవర్ ఫుల్ స్మాష్‌లతో యామగూచి లయ ను దెబ్బ తీసింది. ఒక దశలో స్కోరు బోర్డు ఇరువైపులా సమంగా మారుతూ ఉత్కంఠ రేపినప్ప టికీ…
ఒత్తిడి సమయాల్లో సింధు పట్టుదలగా నిలిచి కీలక పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను 21-17 తో కైవసం చేసుకుంది. తొలి గేమ్ గెలిచిన ఊపుతో రెండో గేమ్‌లో సింధు తన అగ్రెసివ్ ఆటను మరింత పెంచింది.
జపాన్ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతుతో యామ గూచి పుంజుకోవడా నికి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, సింధు డిఫెన్స్ విభాగాన్ని ఛేదించలేకపోయింది. సింధు నెట్ ప్లే వద్ద చూపిన చాకచక్యం యామగూచిపై విజయం సాధించేలా చేసింది.


