పెద్దపల్లి,నిఘా న్యూస్:పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూపను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.మార్కెట్ డైరెక్టర్లుగా కూర మల్లారెడ్డి, కొమ్ము కరుణా కర్, సోమ చంద్రయ్య, మాడగొని శ్రీనివాస్, కొలిపాక కనకయ్య, వేగోళపు పెద్ద రాజేశం తోపాటు..
పిట్టల కొమురయ్య, ఎండి.గౌస్ మియా, గోపతి సదానందం, కొల్లూరి రామచంద్రం, తిప్పారపు ప్రభాకర్, సరోత్తమ్ రెడ్డి, ఎడ్ల మహేందర్ లను నియమించారు.తమ నియామకానికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు చైర్పర్సన్ స్వరూపతో పాటు పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


