హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు.గత ఏడాది వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పథకం అమలు చేసిన విషయాన్ని వారికి తెలియజేస్తారని తెలుస్తోంది.దీనిపై వరంగల్‌లో నిర్వహిం చనున్న కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిం చేందుకే వెళుతున్నట్లు సమాచారం.
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
RELATED ARTICLES


