వేములవాడ (నిఘా న్యూస్) :మహా శివరాత్రి జాతర సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో, పార్కింగ్ ప్రదేశాల్లో, ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు,క్యూ లైన్లలో,కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్ , ఆలయ అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేసిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా జాతర ఏర్పాట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి వాహనాల పార్కింగ్ నిమిత్తం గత సంవత్సరం కంటే ఎక్కువ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని పార్కింగ్ ప్రదేశాల్లో విధులలో ఉన్న సిబ్బందికి టెంట్ మంచి నీటి సదుపాయలు కలిగించాలన్నారు,పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డ్రైవర్షన్ల వద్ద సూచిక బోర్డ్స్,ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
శివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రధాన అలయంతో పాటుగా అనుబంధ దేవాలయాల వద్ద ,పార్కింగ్ ప్రదేశాల వద్ద,శివార్చన ప్రదేశంలో,ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ ఈ. ఓ వినోద్, ఆలయ ఈ. ఈ రాజేష్, డి. ఈ మహిపాల్ రెడ్డి,ఏఈఓ శ్రవణ్ కుమార్,ఏఈ రామ్ కిషన్ రావు,ఎస్.ఐ లు ప్రేమనందం,రాజు,సిబ్బంది ,ఆల
య సిబ్బంది పాల్గొన్నారు.


