రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 18 తేది 05-10-2024 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసినారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరింది.. యారన్ డిపో వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుంది..ప్రధానంగా వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారుగా 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది
యారన్ డిపో ఏర్పాటు చేయడం వలన మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలకు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభిస్తుంది.. ఇట్టి యారన్ డిపోకు 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది..యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరమగ్గాల కార్మికులకు అవసరమగు నూలు టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయను..
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యారన్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటుపై స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యమంత్రి వర్యులు గౌరవనియులు రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ,సహకార&చేనేత శాఖ మంత్రివర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి,గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..


