కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అమ్మాయిలకు రక్షణ ఉండాల్సిన అటెండర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే ఈ పాఠశాల సిబ్బందిని బదిలీ చేశారని, అయితే వారిని కూడా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్యం, పుణ్యం ఎరుగని చిన్నారులపై ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు.


