ప్రత్యేక పూజలో పాల్గొన్న జమ్మికుంట పట్టణానికి చెందిన అయ్యగారు
హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు అంతా గణపతి పూజలో పాల్గొన్నా రు.వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపా ల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించు కోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ మండలేముల శ్రీ కపర్తి శర్మ, (అయ్యగారు) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంట్లో ఈరోజు నిర్వహించిన వినాయక పూజలో ఆయన పాల్గొని పూజలు చేయడం విశేషం..


