హైదరాబాద్, నిఘా న్యూస్: రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి, స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి నిరోధక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి,ఉన్నత స్థాయి సమీక్ష సమా వేశం నిర్వహించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని స్పష్టం చేసిన సీఎం, రేవంత్ రెడ్డి, వీటి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకు రావాలని అధికారుల ను ఆదేశించారు.
ముఖ్యంగా విద్యా సంస్థలను డ్రగ్స్ బారిన పడ కుండా కాపాడేందుకు విద్యా సంస్థల యాజమా న్యాలకే పూర్తి బాధ్య తలను అప్పగించా లని స్పష్టం చేశారు. క్యాంపస్ లోపల డ్రగ్స్‌కు సంబంధించి ఏ చిన్న ఘటన చోటుచేసుకున్నా సదరు విద్యాసంస్థ యాజమాన్యాన్నే పూర్తి బాధ్యులను చేయాలని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.
విద్యాసంస్థలకు అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతల ను కూడా అప్పగిం చాలని ఆదేశించారు. క్యాంపస్ వెలుపల జరిగే అనుమానా స్పద కార్యకలాపా లను గుర్తించి, పోలీ సులకు సమాచారం అందించేందుకు అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించా లన్నారు.
విద్యార్థుల ప్రవర్తన లో వచ్చే మార్పుల ను ప్రాథమిక దశ లోనే గుర్తించేందుకు ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక విభాగా న్ని ఏర్పాటు చేసుకు నేలా చూడాలని అధికారులకు సూచించారు.
త్రీ-స్టెప్ యాక్షన్ ప్లాన్
డ్రగ్స్ సమాచారాన్ని గోప్యంగా అందించేం దుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్లు, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలన్నారు.


