తిరుపతి, నిఘా న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవా లలో బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమై నవి, అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవా లు భక్తులను అలరించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. బ్రహ్మోత్సవాల సేవలతో పాటు, వాహనా సేవలు పూర్తి షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది,
సెప్టెంబర్ నెలలో పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్ర మాలు సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థా నం, 5న శిక్యోత్సవం నిర్వహించనున్నారు. 13న బలరామ జయంతి, వరాహ జయంతి వేడుకలు జరగనున్నాయి.
అనంతరం సెప్టెంబర్ 14న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్య క్రమం నిర్వహించను న్నారు.సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న అత్యంత విశేషమైన గరుడ సేవ నిర్వహిం చనున్నారు. ఈ సేవను తిలకించేం దుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం, 22న రథోత్సవం నిర్వహించనున్నారు.
23న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరో హణం కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి, అనంత పద్మనాభ వ్రతం, చక్ర స్నానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ నెలలో వరుసగా జరిగే ఈ విశేష పర్వదినాలు, బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.


