Thursday, September 3, 2026

నేటి నుంచి బిఆర్ఎస్ పోరుబాట!

హైదరాబాద్, నిఘా న్యూస్: కాంగ్రెస్‌ ప్రభుత్వం నిన్నటి వరకు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమా లకు సిద్ధమైంది నేటి నుంచి వారం రోజుల పాటు సాగే ఈ కార్య క్రమంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు,పాలన వైఫ ల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

కాంగ్రెస్ పార్టీ వేయి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ బుధవారం నుంచి వారం రోజులపాటు గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలో వివిధ దశల్లో ఆందో ళనలు నిర్వహించి ప్రజలను కలవాలని కార్యాచరణ రుపొందించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ లు, అమలు కానివి ఏమిటి ఆ ఇంటికి ప్రభుత్వం హామీ ఇచ్చి బకాయి పడింది ఎంత అనే వివరాలు నమోదు చేసిన బకాయి కార్డులను పంపిణీ చేయాలని బీఆర్‌ఎస్‌ ఆదిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన పథకాలు, అనాటి పరిస్థితులకు ఇప్పటి కి ఉన్న వ్యత్యాసాల ను ప్రజల ముందు ఉంచి వారి మద్దతు ను కూడగట్టుకోవాల ని ఆ పార్టీ నాయక త్వం భావిస్తోంది. మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆదిష్ఠానం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ పాలనపై చార్జీషీట్‌ విడుదల చేసింది.

సెప్టెంబరు 2 నుంచి జిల్లాలో ఈ ఆందోళ న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నా రు. 2న గ్యారంటీల అమలు లో వైఫల్యం, హమీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు. బకాయి కార్డులను ఇంటింటికీ వెళ్లి ఇస్తారు. 3న రైతు సదస్సులు, 4న మహిళలు, దివ్యాంగుల సదస్సు లు, 5న విద్యార్థులు, యువత ర్యాలీలు,

6న అన్ని గ్రామాల్లో ర్యాలీలు, 7న ప్రజావాణిలో అన్ని స్థాయిలో కాంగ్రెస్‌ వైఫల్యాలపై ఫిర్యాదు లు 8న అంబేద్కర్‌ విగ్రహలకు వినతి పత్రాలు అంద చేయా లని నిర్ణయించారు. అయా వర్గాల ప్రజల కు జరుగుతున్న నష్టాలను వారి దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కూడగ ట్టడానికి బీఆర్‌ఎస్‌ వ్యూహం రుపొందిం చింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular