Thursday, September 3, 2026

తుమ్మిడి హట్టి ప్రాజెక్టుపై నేడు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకం గా నిర్మించ తలపెట్టి న తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణంపై నెలకున్న అడ్డంకుల ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగింది, ఢిల్లీ సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్షతన ఈరోజు ఉన్నంతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

నిర్మాణానికి సంబం ధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నెలకొన్న అంశాలపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన మంగళ వారం ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో ఈ సమావే శం నిర్వహించను న్నారు. తెలంగాణ, మహారాష్ట్ర జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికా రులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకే తిక, అంతర్రాష్ట్ర అం శాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించ నున్నారు. ముఖ్యం గా బ్యారేజ్‌ ఎత్తు, నీటి వినియోగం, ముంపు తదితర అం శాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ ను 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర గతంలో అంగీకరించింది. అయితే ఈ ఎత్తుతో అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోం ది. 148 మీటర్ల వద్ద నీటిని తరలించేం దుకు భారీ పంపుల ను వినియోగించాల్సి వస్తుందని, దీంతో విద్యుత్‌ వ్యయం గణనీయంగా పెరుగు తుందని తెలంగాణ సర్కార్ చెబుతోంది.

అందువల్ల బ్యారేజ్‌ ఎత్తును 152 మీటర్ల కు పెంచేందుకు మహారాష్ట్రను ఒప్పిం చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. 152 మీటర్ల ఎత్తుతో నీటిని తక్కువ విద్యుత్‌ వ్యయంతో తరలిం చడంతో పాటు దీర్ఘ కాలంలో రాష్ట్రానికి ప్రాజెక్టు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపిస్తోంది.

మరోవైపు సీడబ్ల్యూ పీఆర్‌ఎస్‌ అధ్యయ నాల ప్రకారం జల మట్టాన్ని పెంచడం వల్ల అదనంగా ఏర్పడే ముంపు పరిమితంగానే ఉంటుందని తెలంగాణ అధికా రులు చెబుతున్నా రు. ఈ అంశాన్ని కూడా సమావేశంలో మహారాష్ట్ర అధికారుల ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాం తాలకు సాగునీరు అందించడంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కీలకంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో చర్చలను ముందుకు తీసుకెళ్తోంది.తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై తెలం గాణ, మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రధానమంత్రిని కోరారు.

అలాగే మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం నిర్వహించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నేటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular