పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి గ్రామానికి చెందిన ఏగోలపు అక్షయ, ఏగోలపు స్ఫూర్తి, ఇద్దరు అక్క చెల్లెళ్లు చదువులో రాణిస్తు న్నారు.గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో బి.ఏ. చదువు తూ తన తరగతిలో ప్రథమ స్థానం సాధించి గ్రామానికి, తల్లి దండ్రులకు గర్వకారణంగా నిలిచారు.
ఇద్దరు సోదరీమణు లను మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు శాలువాలతో ఘనంగా సన్మానించా రు.ఈ సందర్భంగా అక్షయ మాట్లాడు తూ…మా తల్లిదండ్రు లు మాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటా మని అన్నారు.
మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్,లు మాట్లాడుతూ…
గంగాపురి గ్రామానికి చెందిన ఇద్దరు సోదరీమణులు విద్యలో రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. అక్షయ ప్రథమ స్థానం సాధించడం, స్పూర్తి కూడా ప్రతిభ కనబ రుస్తూ ముందుకు సాగడం ప్రతి విద్యా ర్థికి ఈ ఆక్క చెల్లెళ్లు ఆదర్శమన్నారు.
ఇలాంటి విద్యార్థు లను ప్రోత్సహించడం సమాజం బాధ్యత. ఈ ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, గ్రామానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు రామడుగు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, సుభాన్, లక్ష్మణ్, శ్రావణ్, శ్రీకాంత్, కాసర్ల శంకర్ నాంపల్లి శ్రీనివాస్, రావుల రాజ్ కుమార్, తదితరులు పాల్గొని అక్షయ, స్పూర్తిలను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


