Wednesday, July 29, 2026

రాళ్లవాగును పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్..

మంచిర్యాల, నిఘా న్యూస్: మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో ఉన్న రాళ్లవాగును బుధ వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహి స్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతా నికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రమా దకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నా మని చెప్పారు.

పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటిం చాలని, వాగులు, వంకలు, ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేప థ్యంలో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular