Monday, July 20, 2026

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

హైదరాబాద్, నిఘా న్యూస్: భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది దేశంలో హైడ్రోజన్ తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోడీ, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభిం చారు. హర్యానాలోని జింద్ -సోనీ ఫట్, మధ్య 89 కిలోమీట ర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది, ఉత్తర రైల్వేలో ప్రయో గాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు.

ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్‌తో పర్యావరణా నికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి. ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉం టాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది.

దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్ల లోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.ఈ రైల్లో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. జింద్- సోనిపత్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మార్గంలో 11 చోట్ల ఆగుతుంది. రోజుకు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లనుంది.

దీనిని స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభి వృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ ఓవర్‌ హెడ్ విద్యుత్ తీగలు లేకుండా నడుస్తుంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే డీజిల్ రైళ్లలా కాకుండా.. ఈ హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది.

దీంతో పర్యావరణా నికి ఎలాంటి హాని కలగదు. ఈ రైలును నడపడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్‌ను జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ నుండి సరఫరా చేస్తారు. సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి ఈ ప్రాజెక్ట్‌లో అధునా తన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular