Friday, September 18, 2026

ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం

కరీంనగర్, నిఘా న్యూస్: తెలుగు భాష సంరక్షణ సంఘం తెలంగాణ సాహితి సంస్థ ఏటా ప్రధానం చేస్తున్న రాష్ట్రస్థాయి బుర్ర నర్సమ్మ- లింగారెడ్డి,స్మారక తెలంగాణ తెలుగు తేజం,పేరుతో ఇచ్చే సాహిత్య పురస్కారం 2026 కు ప్రముఖ కవి జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు.

ఈ మేరకు పురస్కార కమిటీ చైర్మన్ అవా ర్డు వ్యవస్థాపకులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి,ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధ్యాసం సేనాధిపతి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

ఈ పురస్కార ప్రధాన ఉత్సవం ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు వివరించారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు చేసిన అమూల్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular