హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి : హైదరాబాద్ నగరం లోని బొల్లారంలో చిన్నారి అరేలియా కిడ్నాప్.. హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ ను సోమవారం పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్టు సమా చారం. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పోలీసు లు గుర్తించినట్లు తెలిసింది.సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్ చిన్నారిని కిడ్నాప్ చేసి.. ఆమె ద్వారా డబ్బులు డిమాండ్ చేయాలని పథకం వేసినట్లు తెలుస్తోంది.వారం క్రితమే విక్రమ్ ప్రవర్తన సరిగా లేదనే కారణంతో విల్లాస్ అసోసియేషన్ అతడిని ఉద్యోగం నుంచి తొలగించి నట్లు సమాచారం. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న విక్రమ్ పక్కా ప్రణాళికతో చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. విల్లాలో పనిచేస్తున్న మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు.
చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్?
RELATED ARTICLES


